ఎన్టీఆర్ ది గ్రేట్ : అప్ప‌ట్లోనే విదేశాల్లో అరుదైన రికార్డు సృష్టించిన ఎన్టీఆర్ సినిమా..

-

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ , నటరత్న నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) సీనియర్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవ పతాకగా నిలిచారు. ఆయన సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయ రంగంలోనూ విజయం సాధించారు. క్రమశిక్షణకు మారుపేరు అయిన సీనియర్ ఎన్టీఆర్..ఏ విషయంలోనైనా చాలా జాగ్రత్త వహిస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన ఓ సినిమా మన దేశంలోనే కాదు విదేశంలోనూ అరుదైన రికార్డు సృష్టించింది. ఆ చిత్ర విశేషాలు ఈ రోజు తెలుసుకుందాం.

బ్రహ్మ ముహుర్తం లో .. మేల్కొనే ఎన్టీఆర్.. తన చిత్రాల పట్ల చాలా బాధ్యతగా వహిస్తారు. పౌరాణిక, సాంఘీక, జానపద చిత్రాలు ఏవైనా సరే..ప్రాణం పెట్టి చేస్తారు. ఒక చిత్రం విషయానికొస్తే..మొదలు ఆ ఫిల్మ్ తాను చేయబోనని చెప్పారు. కానీ, చివరికి ఆ చిత్రం చేశారు. అది అరుదైన రికార్డులు నెలకొల్పి తెలుగు వారి సత్తా మాత్రమే భారతీయ చిత్ర సినిమా సత్తా చాటింది. ఆ మూవీయే..‘మల్లీశ్వరి’.

బీ.ఎన్.రెడ్డి దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆ పిక్చర్ లో భానుమతి హీరోయిన్ గా నటించింది. తొలుత ఈ మూవీ చేయబోనని ఎన్టీఆర్ చెప్పారు. కానీ, ఆయనే చేయాలని మూవీ ప్రొడ్యూసర్స్ ఎన్టీఆర్ ను బతిమాలారు.

ఆయన నో చెప్పడంతో అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్ఆర్)తో చేయాలని అనుకున్నారు. దాంతో దర్శకుడు బీ.ఎన్.రెడ్డి మరోసారి వెళ్లి ఎన్టీఆర్ ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. చాలా భాషల్లో ఈ ఫిల్మ్ రిలీజ్ అయి మంచి పేరు తీసుకొస్తుందని చెప్పి ఒప్పించారు. అలా చివరకు ఎన్టీఆర్ ఈ సినిమా చేశారు. ఇందులో ‘నాగరాజు’ పాత్రను ఎన్టీఆర్ పోషించారు. ఈ చిత్రం మనదేశంలోనే కాదు చైనాలోనూ వంద రోజులు ఆడి అరుదైన రికార్డు సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news