దర్శకుడు విఠలాచార్యతో సినిమా చేయబోనన్న ఎన్టీఆర్.. కారణమదేనా.. !!

-

అప్పట్లో అనగా 1960,70ల్లో దర్శకుడు విఠలాచార్యకు ఉన్న క్రేజ్ గురించి మనకు తెలియదు. కానీ, ఆయన అప్పట్లోనే భారతదేశంలోనే ఎక్కువ పారితోషికం తీసుకున్న దర్శకుడిగా రికార్డుల్లో ఉన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లిన విఠలాచార్య..ఆ తర్వాత కాలంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సినీ దర్శకుడై ప్రఖ్యాతి గాంచారు. కర్నాటకలో టూరింగ్ టాకీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన విఠలాచార్య.. ఆ తర్వాత జాన పద చిత్రాలు చేయడానికి ఇష్టపడ్డారు. అలా ఓ దర్శకుడు సినిమా చేస్తానని చెప్పి చేయకపోవడంతో ఆయనే ఆ పిక్చర్ కు దర్శకత్వం వహించారు.

అలా దర్శకుడిగా మారిన విఠలా చార్య..‘జాన పద బ్రహ్మ’ అయిపోయారు. దెయ్యాల సినిమాలను కూడా ఇంట్రెస్టింగ్ గా చేసి చక్కటి పేరు సంపాదించుకున్నారు విఠలాచార్య. 55 సినిమాలకు దర్శకత్వం వహించిన విఠలాచార్యతో.. ఒక్క సినిమా అయినా చేయాలని అప్పటి హీరో , హీరోయిన్లు అనుకున్నారు. ఇక నటీ నటులు అయితే విఠలా చార్య దర్శకత్వంలో ఒక్క పిక్చర్, ఒక్క చిన్న పాత్ర అయినా పోషించాలని అనుకున్నారు. కాగా, సీనియర ఎన్టీఆర్ మాత్రం దర్శకుడు విఠలాచార్య వచ్చి అడిగినా సినిమా చేయబోనని చెప్పేశారట. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇతర దర్శకులతో పోల్చుకుంటే దర్శకుడు విఠలా చార్య సినిమాల మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్ తో అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయాలన్నట్లు ఆయన ప్లాన్ చేసుకుంటాడు. ఆయన బడ్జెట్ తక్కువ అయ్యేలా పిక్చర్ కంప్లీట్ చేయాలనుకుంటారు. అలా తొలు త హీరో డేట్స్ తీసుకుని సినిమా పూర్తి చేయాలనుకుంటారు.

అలా తక్కువ డేట్స్ తీసుకున్న నేపథ్యంలో తొందరగా సినిమా కంప్లీట్ చేయాలనుకుంటారు దర్శకుడు విఠలాచార్య. అలా ఒకసారి సీనియర్ ఎన్టీఆర్ డేట్లు అడగగా, వారం రోజులు ఖాళీ ఉన్నాయని చెప్పగా సరిపోతాయని అన్నారట. దాంతో ఆ మాటలకు భయపడ్డ ఎన్టీఆర్ ఆయనతో సినిమా అంటే.. సగంలోనే సినిమా ఆపేస్తారేమో అనే భయంతో పిక్చర్ చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదట.

Read more RELATED
Recommended to you

Latest news