Shaakuntalam : “శాకుంతలం” రిలీజ్ డేట్ ఫిక్స్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఫిల్మ్ ‘శాకుంతలం’. ప్రకృతి ప్రియం ‘శాకుంతలం’ సినిమాపైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. టైటిల్ రోల్ ‘శకుంతల’ను సమంత ప్లే చేస్తుండగా, దుష్యంతుడిగా మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ నటించారు.

ఈ పిక్చర్ ద్వారా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఈ చిత్ర అప్ డేట్స్ కోసం చాలా కాలంగా సినీ అభిమానులు ఎదురు చూస్తుండగా, ఇటీవల సమంత అప్ డేట్ ఇచ్చేసింది.

సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాగా, ఆదివారం డబ్బింగ్ కంప్లీట్ అయినట్లు సమంత ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలిపింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్ర బృందం అనౌన్స్‌ చేసింది. ఈ సినిమాను నవంబర్‌ 4 వ తేదీన విడుదల చేయనున్నామని తెలిపింది. ఈ మేరకు ఓ రొమాంటిక్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news