టిడిపి తరపున ఎన్టీఆర్ ప్రచారం..?

-

ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంటూ వచ్చిన నందమూరి బాబాయ్, అబ్బాయ్ లు ఓ విషాదంతో కలవాల్సి వచ్చింది. తాను శాస్వతంగా దూరమై తన కుటుంబాన్ని ఒక్కటయ్యేలా చేశాడు స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ. ఇక రీసెంట్ గా అరవింద సమేత సక్సెస్ మీట్ లో కూడా బాబాయ్, అబ్బాయ్ ల సందడి చూశాం. అయితే స్టేజ్ మీద ఎన్.టి.ఆర్ గురించి మాట్లాడలేదు అన్న ఒక్క కారణం తప్ప ఆ వేడుక జరుగుతున్నంత సేపు ఎన్.టి.ఆర్ తో బాలకృష్ణ ఏదో ఒక విషయమై చర్చిస్తూ ఉన్నారు.

ఇదిలాఉంటే అరవింద సమేత సక్సెస్ మీట్ అయిన తర్వాత కూడా ఎన్.టి.ఆర్, బాలకృష్ణ ఆ రోజు రాత్రి పార్టీలో పాల్గొన్నారట. అంతేకాదు సిని, రాజకీయ సంబందిత విషయాల పట్ల తీవ్రంగా చర్చలు జరిపారని తెలుస్తుంది. రాబోతున్న ఎన్నికల్లో ఎన్.టి.ఆర్ కూడా ప్రచారంలో పాల్గొనేలా బాలకృష్ణ కోరినట్టు తెలుస్తుంది. 2009లో ఎన్.టి.ఆర్ టిడిపి తరపున ప్రచారంలో పాల్గొన్నాడు. అప్పుడు కూడా ఎన్.టి.ఆర్ ను వాడుకుని వదిలేశారన్న టాక్ వచ్చింది. ఈమధ్యలోనే ఎన్.టి.ఆర్ ను సొంత మనుషులే తొక్కేయాలని చూశారన్న వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా మళ్లీ నందమూరి హీరోలు అటు సినిమాలకు ఇటు రాజకీయాలకు ఒక ఒప్పందంతో పనిచేయడం నందమూరి ఫ్యాన్స్ కు మాత్రం ఆమోదయోగ్యమైనదే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news