‘నాటు నాటు’ పాటకు షారుక్ డాన్స్..

-

టాలీవుడ్ సినిమా అంతర్జాతీయ వేదికపై మెరిసింది తాజాగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట అవార్డును అందుకుంది.. ఇది భారతదేశానికే గర్వకారణం అని చెప్పవచ్చు అయితే ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఈ మూవీ టీం పై మరొకసారి ప్రశంసలు వర్షం కురిపించారు..

అర్ అర్ అర్ సినిమాలో నాటు నాటు పాట 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌‌కు సంబంధించి బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీల్లో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయంపై ప్రధాని మోదీ తో పాటు ఇప్పటికే పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే.. వీరిలో ఏఆర్ రెహమాన్ చిరంజీవి నాగార్జున తో సైతం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా ఉన్నారు అయితే తాజాగా షారుఖ్ ఖాన్ ఈ పాటకు రావటం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పుకొచ్చారు..

రాజమౌళిని ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన షారుఖ్.. ‘సర్ ఇప్పుడే మేల్కొన్నాను. గోల్డెన్ గ్లోబ్స్‌లో మీ విజయాన్ని నాటు నాటుకు డ్యాన్స్ చేయడం ద్వారా మొదలుపెట్టాను. మీరు ఇంకా మరెన్నో అవార్డులు అందుకుని భారతదేశం గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశాడు షారుఖ్.

అలాగే షారుక్ ఖాన్ దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న పటాన్ సినిమా ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో రామ్ చరణ్ ఈ ట్రైలర్ను ట్విట్టర్లో పోస్ట్ చేసి ట్రైలర్ చాలా బాగుంది అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయానికి స్పందించిన షారుక్ ‘మీ సినిమాకు ఆస్కార్ వస్తే ఒక్కసారి నన్ను ముట్టుకొనివ్వండి..’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.. ఫన్నీ కన్వర్జేషన్ చూస్తూ ఉంటే బాలీవుడ్ టాలీవుడ్ మధ్య అనుబంధం రోజురోజుకీ పెరుగుతున్నట్టే కనిపిస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news