వరల్డ్ రికార్డ్స్ సాధించిన ఇండియన్స్..3 రోజుల్లో 7 ఖండాలను చుట్టేసి..

-

మన ఇండియన్స్ గురించి,వాళ్ళు సాధించిన, సాధిస్తున్న ఘనతల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే.. ఎన్నో అరుదైన రికార్డుల ను సొంతం చేసుకున్నారు.. అసాధ్యం అనుకున్న వాటిని కూడా సాధించి చూపిస్తున్నారు. అంతేకాదు అత్యంత ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ లో చోటు దక్కించుకుంటున్న ఎన్నో మనం చూసే ఉన్నాం.. ఇప్పుడు మరో ఇద్దరు బారతీయులు గిన్నిస్ లో చోటు సంపాదించుకున్నారు. ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకున్నారు.. అందరి నోట్లో ప్రస్తుతం వీరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయని చెప్పడంలో డౌట్ లేదు..
ఆ వివరాల్లొకి వెళితే.. డా. అలీ ఇరానీ, సుజయ్ కుమార్ మిత్రా.. భూమ్మీదున్న 7 ఖండాలను 73 గంటల్లోనే చుట్టొచ్చి సరికొత్త రికార్డు నెలకొల్పారు..

అతి తక్కువ సమయం లో అన్ని ఖండాల్లో పర్యటించిన వారిని గిన్నిస్ రికార్డ్ వరించింది. అరుదైన రికార్డ్ నెలకొల్పడంపై ఇరువురూ హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు మేము ఓ రికార్డు బద్దలు కొట్టి ఉండొచ్చు. కానీ..రేపు ఇంకొకరు మా రికార్డ్‌ను అధిగమిస్తారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ రికార్డైనా అధిగమించొచ్చనేది తమ నమ్మకమని వారు చెప్పారు. పర్యటనలంటే ఇష్టపడే అలీ, సుజయ్.. కేవలం మూడు రోజుల్లోనే ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఓషియానా లను చుట్టొచ్చేశారు. ఈనెల డిసెంబర్ 4న అంటార్కిటికాలో మొదలైన వారి పర్యటన డిసెంబర్ 7న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌ నగరంలో ముగిసింది.ఈ విషయాన్ని వారు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news