సముద్ర తీరాన షాలిని పాండే రచ్చ.. ఫోటోలు వైరల్

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అయితే ఆ సినిమాలో విజయ్ దేవరకొండ తో ఓవర్ డోస్ రొమాన్స్ చేసి కుర్రకారును ఫీదా చేసింది షాలిని పాండే. ఆ తర్వాత మహానటి లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఇండస్ట్రీకి డబ్బు కోసమే రాలేదని అందుకే మళ్లీ అర్జున్ రెడ్డి లాంటి సినిమా చేయలేదని అంది షాలిని పాండే.

అర్జున్ రెడ్డి తర్వాత “మహానటి”, “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాల్లో నటించినా అభిపెద్దగా గుర్తింపు తెచ్చే పాత్రలు కాలేదు. ఇటీవల కళ్యాణ్ రామ్ 118 సినిమాలో నటించిన శాలిని పాండే కి ఆ తర్వాత పెద్దగా సినిమా చాన్సులు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో అందాల ఆరబోత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఈ హాట్ బ్యూటీ.

కుర్రాళ్ళు అంత త్వరగా మరిచిపోలేని ఈ బ్యూటీ.. తరచూ బికినీలో కనిపిస్తూ దర్శక నిర్మాతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా షాలిని పాండే సముద్ర తీరాన బికినీలో రచ్చ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా ఉన్న షాలిని ఇప్పుడు మాత్రం నాజూకుగా తయారైంది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణవీర్ సింగ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.