సైలెంట్ గా సీక్వల్ మొదలుపెట్టారు

-

శంకర్ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీస్ లో భారతీయుడు ఒకటి. అప్పట్లోనే నేషనల్ వైడ్ గా ఆ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కమల్ నట విశ్వరూపంతో పాటుగా శంకర్ డైరక్షన్ టాలెంట్ గురించి అందరు మాట్లాడుకునేలా చేసింది భారతీయుడు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. 22 ఏళ్ల తర్వాత ఇండియన్ పార్ట్ 2 మొదలు పెట్టారు.

సీక్వల్ సినిమాను సైలెంట్ గా మొదలు పెట్టారు శంకర్, కమల్ హాసన్. మొదటి పార్ట్ లానే సమకాలీన రాజకీయాల గురించి ఈ సినిమాలో ప్రస్థావించడం జరుగుతుందట. పార్ట్ 2లో కూడా కమల్ హాసన్ డ్యుయల్ రోల్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మళయాల హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడని సమాచారం. సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుందని తెలుస్తుండగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తాడని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఇండియన్-2 సినిమా నిర్మిస్తున్నారు.

సూపర్ స్టార్ రజిని హీరోగా శంకర్ డైరక్షన్ లో వస్తున్న 2.ఓ ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఆ సినిమా రిలీజ్ అవడం ఆలస్యం ఇండియన్-2 రెగ్యులర్ షూట్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు శంకర్.

Read more RELATED
Recommended to you

Latest news