సినిమాలో ఓకే గాని బయట కూడా అవసరమా..!!

-

షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఎన్నాళ్ళ నుండో బాలీవుడ్ వారు వెయిట్ చేస్తున్న విజయం లభించింది అని సంబరాలు చేసుకుంటున్నారు.

జాన్ అబ్రహం ఇతర ప్రధాన తారాగణంతో తెరకెక్కిన పఠాన్ సినిమా అన్ని చోట్లా  అన్ని రకాల భాషల్లో  భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.  ఇప్పటి వరకు 580 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షారుక్ ఖాన్ మరియు దీపికా పదుకునే మాట్లాడారు. ఇక వీరు స్టేజ్ మీద చేసిన రొమాన్స్ చూడ టానికి రెండు కళ్లు చాలవు. నిజంగా పెళ్లి అయిన కొత్త జంట కూడా అంత మందిలో అలా వుండే అవకాశం లేదు. దీపికా పదుకునే రెచ్చి పోయి మరీ ముద్దులు ఇచ్చింది. ఇద్దరూ చాలా దగ్గరగా కబుర్లు కాకరకాయలు చెప్పుకున్నారు చెవులు కొరక్కుంటున్నారు. ఇది చూసి అందరూ సినిమాలో ఓకే గాని బయట కూడా అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news