లీకైన శర్వానంద్ కొత్త సినిమా స్టిల్స్.. షాక్ అవడం గ్యారెంటీ..!

-

పడి పడి లేచే మనసు సినిమాతో నిరాశపరచిన శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి యంగ్ రోల్ కాగా మరోటి మధ్య వయస్కుడి పాత్రలో కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని శర్వానంద్ మిడిల్ ఏజ్ రోల్ లుక్ లీక్ అయ్యింది. స్పెయిన్ షూటింగ్ స్పాట్ నుండి ఈ పిక్స్ లీక్ అవడంతో చిత్రయూనిట్ షాక్ అయ్యారు.

సినిమాలో శర్వానంద్ సెకండ్ లుక్ ను సీక్రెట్ గా ఉంచాలని అనుకున్నారు కాని ఇలా లీక్ అవడంతో త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ ద్వారా శర్వానంద్ లుక్ రివీల్ చేయనున్నారట. మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు దళపతి అనే టైటిల్ పరిశీలణలో ఉంది. ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్న చందంగా కెరియర్ కొనసాగిస్తున్న శర్వానంద్ ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news