అందమైన లొకేషన్లలో ‘కృష్ణ వింద విహారి’ షూటింగ్.. వీడియో షేర్ చేసిన షెర్లీ సేతియా

-

నాగశౌర్య, షెర్లీ సేతియా జంటగా నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా ఇటీవలే థియేటర్లలో సందడి చేసింది.  నాగశౌర్య తండ్రి ప్రసాద్ ముల్పూరి సమర్పణలో, హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో తల్లి ఉషా ముల్పూరి నిర్మించారు.  ‘అలా ఎలా’, ‘లవర్’, ‘గాలి సంపత్’ చిత్రాల దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.

సినిమా ఎలా ఉందనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఫన్ ను తన కెమెరాలో బంధించింది హీరోయిన్ షెర్లీ సేతియా. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను తన వ్లోగ్ ద్వారా విడుదల చేసింది. అందమైన మంచు కొండలు, ప్రకృతి రమణీయతకు నిదర్శనం అయిన కాఫీ తోటల్లో వాన కురుస్తుండగా హీరోయిన్ షెర్లీ.. మూవీ టీమ్ తో, హీరో నాగశౌర్యతో చేసిన ఫన్ భలే ఉంది.

డ్యాన్స్ ప్రాక్టీస్, మేకప్ రూమ్ ముచ్చట్లు, హీరో హీరోయిన్ల మధ్య సీన్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. తన పెట్ డాగ్ తో షెర్లీ సరదాగా గడిపిన క్షణాలు ఆకట్టుకున్నాయి. షెర్లీ అప్ లోడ్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news