అనుకున్నట్లు గానే శివ, విజయ్ తో పని మొదలు పెట్టారు.!

-

విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా కావాల్సింది. కాని లైగెర్ సినిమా ఇటు పూరి జగన్నాథ్ ను అలాగే విజయ్ దేవరకొండ ను బాగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వం లో ,సమంత  హీరోయిన్ గా ఖుషి అనే సినిమా చేస్తున్నాడు.

ప్రస్తుతం సమంత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల షూటింగ్ కూడా సాధ్యం కావడం లేదు ఇక ఎప్పుడూ సమంత వస్తే అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. ఇక ఖుషి సినిమా విషయంలో ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. సమంత ను తీసి కొత్త హీరోయిన్ ను పెట్టబోతున్నారు అని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. దీనిపై యూనిట్ వర్గాలు ఎవరూ ఖండించడం కూడా చేయలేదు. ఇక రీసెంట్ గా సమంత వర్క్ అవుట్ చేస్తూ ఫిట్ గా మారి షూటింగ్ కు ఒకే చెప్పింది.

 తాజాగా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ చిత్ర షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ను ఇచ్చారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో ప్రారంభిస్తాం అని అన్నారు. ఇక భవిష్యత్ బ్యూటి ఫుల్ గా ఉండ బొతుంది అంటూ ఆనందంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అనుకున్నట్టు గానే తన పని మొదలు పెట్టారు. ముందుగా సంగీతం మీద దృష్టి పెట్టారు. సినీమా హీరో విజయ్ ,హేసమ్ అబ్దుల్ తో కలసి మ్యూజిక్ పని మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news