బింబిసార చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలిస్తే షాక్..!

-

ఏ కాలంలో అయినా సరే సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులకు కొదవ ఉండదు. ముఖ్యంగా హీరో హీరోయిన్ లకి కంటే కూడా చైల్డ్ ఆర్టిస్టులకే త్వరగా మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్లకు చిన్నప్పటి పాత్రలలో ఈ చైల్డ్ ఆర్టిస్టులు నటించడమే కాకుండా వారికి పిల్లలుగా కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇటీవల బాలయ్య నటించిన అఖండ సినిమాలో పాప అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మల్లి పాత్ర పోషించిన పాప కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది . ఇప్పుడు బింబిసారా సినిమాలో నటించిన పాప కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం గమనార్హం. ఈ క్రమం లోనే ఈ పాప గురించి ప్రేక్షకులు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ పాప పేరు శ్రీదేవి.

శ్రీదేవికి ఇదే మొదటి సినిమా కాదు. ఎందుకంటే ఇంతకు ముందు పలు సినిమాలలో కూడా నటించింది. ఈ పాప రామారావు ఆన్ డ్యూటీ, మేజర్ వంటి సినిమాలలో నటించిన ఈమె.. ఆ తర్వాత ప్రేమ, యమలీల, కళ్యాణ వైభోగమే వంటి టీవీ సీరియల్స్ లో కూడా నటించి అటు వెండితెర ప్రేక్షకులకు, ఇటు బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయస్తురాలు అయింది. చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి తన తండ్రి ద్వారా నటనలో అడుగు పెట్టింది. ఇక ఈ పాప తండ్రి శ్రీహరి గౌడ్.. ఆర్టిస్ట్ మాత్రమే కాదు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. ప్రస్తుతం షూటింగ్స్ నిమిత్తం హైదరాబాదులో ఉంటున్నట్లు సమాచారం.

Bimbisara Movie Child Artist : బింబిసార మూవీలో నటించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా ?

ఇకపోతే ముద్దు ముద్దుగా క్యూట్ మాటలతో ఈ చిన్నారి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ పాప సెంటిమెంట్ తోనే కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అని సమాచారం. ఏది ఏమైనా చైల్డ్ ఆర్టిస్ట్ లే సినిమాలకు ప్రాణం పోస్తున్నారు అనడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news