లస్ట్ స్టోరీస్ కోసం తమన్నా పారితోషకం తెలిస్తే షాక్..!

-

లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది మిల్క్ బ్యూటీ తమన్నా .. తెలుగుతోపాటు తమిళ , హిందీ భాషల్లో కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఆగస్టు 11వ తేదీన విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ గా నటించిన విషయం తెలిసిందే .ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక సీరీస్ లో భాగంగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో కూడా ఈమె నటించింది. ఇది ఇలా ఉంటే తమన్నా ఈ వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ.6 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. మామూలుగా ఒక్కో సినిమాకు రూ.5కోట్లు అందుకునే ఈ ముద్దుగుమ్మ ఈ సిరీస్ కోసం ఏకంగా 6 కోట్ల రూపాయలను అందుకుందట. ఎందుకంటే ఇందులో భారీ బోల్డ్ సన్నివేశాలలో నటించడం కోసం ఆమె ఈ రేంజ్ లో పారితోషకం తీసుకుందని సమాచారం.

ఇక అటు సినిమాలకు ఇటు వెబ్ సిరీస్ లకు ఈ రేంజ్ లో పారితోషకం తీసుకుంటుంది కాబట్టే ఈమె ఆస్తులు కూడా పెరిగాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఏడాదికి 18 కోట్లకు పైగా సంపాదిస్తున్న ఈమె నెలకు రెండు కోట్ల చొప్పున సంపాదిస్తుందని సమాచారం. ఇకపోతే తన 18 ఏళ్ల నటన జీవితంలో మొదటిసారి తెరపై నో ముద్దు నిబంధనను తన బాయ్ ఫ్రెండ్ విజయ వర్మ కోసం ఉల్లంఘించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశాడట. ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news