రానా చెల్లి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్..!

సాధారణంగా అటు టాలీవుడ్ , ఇటు బాలీవుడ్ లో ఉన్న సెలెబ్రిటీల వారసులు సినిమాలలో తమ కెరీర్ వెతుక్కునే ప్రయత్నం పూర్వం నుంచి చేస్తున్న విషయం తెలిసిందే. అలా ఎంతోమంది హీరోలుగా.. లేక వివిధ విభాగాల్లో కానీ స్థిరపడ్డారు. అయితే కొంతమంది మాత్రం తమకు నచ్చిన కెరియర్ను ఎంచుకొని స్థిరపడిపోతుంటారు . అందులో నిర్మాత డి సురేష్ బాబు కుమార్తె మాళవిక కూడా ఒకరు . రానా చెల్లిగా బాగా పరిచయమైన ఈమె దగ్గుపాటి వంశంలోనే బాగా చదువుకున్న అమ్మాయి. సురేష్ బాబుకి కుమారులు రానా , అభిరామ్ కంటే కూతురు మాళవిక అంటేనే చాలా ఇష్టం ఎక్కువ. అందుకే మానవికను చాలా ప్రేమగా పెంచారు.

అంతేకాదు తాతయ్య డాక్టర్ డి రామానాయుడు కూడా దగ్గుబాటి వంశంలో తొలి వారసురాలు కావడంతో ఈమెను చాలా గారాబంగా చూసేవారట. చిన్నప్పటి నుంచి చదువుపై ఎక్కువ శ్రద్ధ కనబరిచిన మాళవిక మేనేజ్మెంట్ కోర్సులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. అంతేకాదు కావ్య కన్సల్టెన్సీ వంటి ప్రముఖ సంస్థల్లో జాబు వచ్చి.. వారు ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీ కూడా ఆఫర్ చేశారట. అయితే జాబు చేస్తున్నప్పుడే ఆమెకు పెళ్లయింది. ఇక ఆ సంబంధం వెంకటేష్ భార్య నీరజాతరపు బంధువులదట. అందుకే మాళవిక మరో ఆలోచన లేకుండా పెళ్లికి ఒకే చెప్పడంతో 2012 డిసెంబర్ 5న అత్యంత వైభవంగా ఈమె వివాహం జరిగింది.

ఈమె భర్త పొట్లూరి భరత్ కృష్ణారావు. భరత్ ఫ్యామిలీ కి బెంగళూరులో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా యేటా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 2015లో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన మాళవిక కుటుంబంతో కలిసి బెంగళూరులోనే ఉంటుంది. అంతేకాదు ప్రతి రాఖీ పండుగకు ఎక్కడ ఉన్నా సరే అన్నయ్యలు రానా, అభిరాములకు రాఖీ కట్టి మురిసిపోతుంది. అలాగే వెంకటేష్ కొడుకు అర్జున్ కి కూడా రాఖీ కట్టందే ఆమె తిరిగి వెళ్ళలేదు. ఇక మాళవిక అంటే కుటుంబంలో అందరికీ ఇష్టమే కాదు.. ఆమె అంటే పంచప్రాణాలు కూడా.