తెలుగు బుల్లితెరపై సత్తా చాటిన యాంకర్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అందులో ఒకరు శిల్ప చక్రవర్తి కూడా.. హైదరాబాదుకు చెందిన ఈమె తనదైన శైలి యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పలు టీవీ షోలకు హోస్టుగా వ్యవహరించిన శిల్ప స్మాల్ స్క్రీన్ పై అలరించడమే కాకుండా నువ్వే నువ్వే వంటి చిత్రాలలో కూడా కనిపించి బుల్లితెర ప్రేక్షకులనే కాదు వెండితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.
ఇకపోతే శిల్ప కుటుంబం విషయానికి వస్తే.. ఈమెది బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం . తండ్రి రైల్వే ఉద్యోగం కావడంతో వారి కుటుంబం ఇక్కడే స్థిరపడింది. సికింద్రాబాద్లో ఉన్న రైల్వే స్కూల్, కాలేజ్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె మంచి కథక్ నృత్యకారిని కూడా.. మొదట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత బుల్లితెరవైపు మొగ్గుచూపింది. ఇక అల్టిమేట్ గేమ్ షో తో బుల్లితెర యాంకర్ గా పరిచయమైన శిల్ప ఆ తర్వాత కంటే కూతుర్నే కనాలి అనే సీరియల్ లో కూడా నటించింది. అంతేకాదు డాన్స్ బేబీ డాన్స్, భలే జోడి వంటి టాప్ టీవీ షోలకు హోస్ట్గా వ్యవహరించి తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా ఎదిగిపోయి.. ఎన్నో స్పెషల్ ఈవెంట్లు, ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు చేసి సందడి చేసింది.
ఇక కెరియర్ పీక్స్ లో ఉన్న గానే కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న ఈమె ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. ఇక పిల్లల పుట్టడంతో యాంకరింగ్ కి , నటనకు దూరం అయిన శిల్ప 2019 బిగ్ బాస్ 3 వ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్ గా హౌస్ లోకి వచ్చింది. ఇక తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఫోటోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలు పంచుకోగా అవి వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram