తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలి – వైఎస్‌ షర్మిల

-

తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. తాలిబన్లకు అధ్యక్షుడు అని ఫైర్‌ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో దొర అరాచకాలు, ఆగడాలకు అంతే లేదని చురకలు అంటించారు. ప్రశ్నిస్తే కేసులు,అరెస్టులు,జైల్లో పెట్టి చావ బాదడాలు అని.. పట్టపగలే నడి రోడ్డుపై హత్యలు. శాంతిభద్రతలు అదుపులో లేవని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను బ్రతనివ్వరు.ప్రతిపక్షాలను ఉండనివ్వరని నిప్పులు చెరిగారు షర్మిల.

దొర నియంత పాలనలో ఎన్నికలు కూడా సవ్యంగా జరుగుతాయనే నమ్మకం లేదని.. అందుకే తెలంగాణలో ఎమర్జెన్సీ విధించాలి.రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్‌ చేశారు వైఎస్‌ షర్మిల. నిధులు ఇస్తలేరు అని ప్రగతి భవన్ ల దొంగ ఏడుపులు తప్పా..స్వయంగా ప్రధాని నే రాష్ట్రానికొస్తే ఎదుటపడి అడిగింది లేదన్నారు. కేసీఅర్ మాటలు కోటలు దాటుతయ్.. చేతలు గడీ గడప దాటయ్ అనే దానికే నిదర్శనం అని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పునే లెక్క చేయరా అంటూ దొంగ మాటలు చెప్పే దొర గారు…తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల స్థలాల కోసం ఇచ్చిన సుప్రీం తీర్పును మీరెక్కడ లెక్క చేశా రో సమాధానం చెప్పాలని నిలదీశారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news