సాధారణంగా నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సెలబ్రిటీలు స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు నెటిజన్ల తిక్క ప్రశ్నలకు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తూ.. వారి తిక్క కుదురుస్తూ ఉంటారనటంలో సందేహం లేదు. సరిగ్గా ఇలాంటి పనే చేసింది శృతిహాసన్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సంక్రాంతి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్.. ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది.
కొద్దిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటెస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా అభిమానులతో ఇన్స్టా వేదికగా చిట్ చాట్ నిర్వహించింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందించగా ఒక నిటిజన్ మాత్రం తిక్క ప్రశ్న వేశాడు.. అయితే అందుకు దీటుగా శృతి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.. ఇందులో ఒక నెటిజన్ నేను మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నాను అంటూ ఓపెన్ కామెంట్ చేయగా… నేరుగా ఆమె నో అంటూ చెప్పేసింది . ఆ తర్వాత మరో నెటిజన్ ఆర్ యు వర్జిన్ అంటూ తిక్క ప్రశ్న వేశాడు..
దానికి శృతిహాసన్ సరదాగా స్పందిస్తూ.. ముందు నువ్వు స్పెల్లింగ్ రాయడం నేర్చుకో… స్పెల్లింగ్ చూడు అంటూ అతడికి కౌంటర్ ఇచ్చింది.. అలాగే తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా తో కలిసి చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఏదేమైనా నెటిజన్లో ఇలాంటి తిక్క ప్రశ్నలు అడిగితే మాత్రం హీరోయిన్లు అందుకు తగ్గట్టుగా సమాధానం చెబుతారు అనడంలో సందేహం లేదు.