ప‌డ‌గ‌విప్పిన పాము శింబు మెడ‌లో..

-

శింబు.. శిలంబ‌ర‌స‌న్‌.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపుతో పాటు ప‌లు అవార్డుల్ని సంతం చేసుకున్నాడు. బాల న‌టుడిగా చ‌క్క‌ని ఈజ్‌ని ప్ర‌ద‌ర్శించి అంద‌రి చేత ఔరా అనిపించుకున్నాడు. అత‌ను న‌టించిన మ‌న్మ‌థ‌, వ‌ల్ల‌భ చిత్రాలు తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాల్ని సాధించి శింబుకు హీరోగా ప్ర‌త్యేక గుర్తింపుని తీసుకొచ్చాయి.

త‌ను న‌టించిన చిత్రాల‌కు సింగ‌ర్‌గా, లిరిసిస్ట్‌గా, డైరెక్ట‌ర్‌గా, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా మంచి గుర్తింపుని సాధించాడు. అయితే గ‌త కొంత కాలంగా ల‌వ్‌, డేటింగ్ వంటి కార‌ణాల‌తో శింబు కెరీర్‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగే స‌త్తా వున్నా హీరోయిన్‌ల‌తో డేటింగ్‌, ల‌వ్‌ల కార‌ణంగా రేసులో వెన‌క‌బ‌డిపోయాడు. కావాల్సిన టాలెంట్ వుండి కూడా స్టార్ హీరోల జాబితాలో చేర‌లేక‌పోయాడు. తాజాగా అత‌నిలో మార్పు మొద‌లైన‌ట్టు తెలుస్తోంది.

అందులో భాగంగా ద‌ర్శ‌కుడు సుశీందిర‌న్ తెర‌కెక్కిస్తున్న `ఈశ్వ‌ర‌న్‌` చిత్రంలో గ్రామీణ యువ‌కుడిగా ప‌క్కా మాస్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇదే చిత్రాన్ని తెలుగులో `ఈశ్వ‌రుడు` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కెవీ దురై కంప‌నీ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తోంది. తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. `మ‌న్మ‌థ‌` టైమ్‌లో శింబు ఎలా వున్నాడో అచ్చం అదే లుక్‌లో ఈ మూవీలో క‌నిపిస్తున్నాడు. లుంగీ క‌ట్టి మెడ‌లో బుస‌లు కొడుతున్న పాముతో క‌నిపిస్తున్న శింబు లుక్ ఆక‌ట్టుకుంటోంది. శింబు ఈమూవీతో మ‌ళ్లీ ట్రాక్ ఎక్క‌బోతున్నార‌నే సంకేతాల్ని అందిస్తోంది. ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో శింబుకు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news