‘సార్’గా ధనుష్ వచ్చేస్తున్నాడు..

-

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం..టాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాటు యూత్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమాలు చేస్తున్నారు. వెంకీ అట్లూరి -ధనుష్ కాంబో మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ఈ పిక్చర్ కు ‘సార్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి అప్ డేట్స్ కోసం సినీ అభిమానులు ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అప్ డేట్ ఇచ్చేశారు.

సాంగ్ రికార్డింగ్ జరుగుతున్నట్లు తెలిపారు జీవి ప్రకాశ్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుండగా, డెఫినెట్ గా ఈ ఫిల్మ్ సక్సెస్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు రికార్డవుతున్న ఈ సంగ్ డ్యాన్స్ నెంబరని, ఇందులో హెవీ డ్యాన్స్ ఉంటుందని హింట్ ఇచ్చేశాడు జీవీ ప్రకాశ్ కుమార్. త్వరలో ఈ సినిమా అప్ డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్. ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘సార్’ కావడం విశేషం. కాగా, ఈ పిక్చర్ తమిళ్ భాషలోనూ విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news