సీత మేకింగ్ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు..!

326

ప్రస్తుత జనరేషన్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా బాగా డిమాండ్ పెరుగుతోంది. అనుష్క, నయనతార లాంటి వాళ్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి.. సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు వాళ్ల బాటలోనే వెళ్తోంది కాజల్ అగర్వాల్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సీత.

Sita Movie Making Video

ఈ సినిమా రేపు అంటే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ ఈ సినిమాకు డైరెక్టర్. బెల్లంకొండ శ్రీనివాస్, సోనూసూద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా సీత మేకింగ్ వీడియోను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. షూటింగ్ సమయంలో వాళ్లు చేసే చిలిపి చేష్టలను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది చిత్రబృందం. వీడియో మాత్రం ఆద్యంతం ఫన్నీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. సీత మేకింగ్ వీడియోను చూసి కాసేపు నవ్వుకోండి.