మ‌హేష్ పాట‌కు కూతురు సితార డ్యాన్స్‌ ఇర‌గ‌తీసిందిగా.. వైరల్ వీడియో

-

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న మహేష్‌కు జోడిగా నటిస్తోంది. దిల్‌ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 11న విడుద‌ల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్లను కూడా పెంచేశారు. ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో అంచనాలు పెంచగా.. ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

మొదటగా మాస్ బీట్ అయిన మైండ్ బ్లాక్ అనే పాటను, ఆపై సూర్యుడివో చంద్రుడివో అంటూ మంచి ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇక రీసెంట్‌గా హీ ఈజ్ సో క్యూట్ అంటూ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే హి ఈజ్ సో క్యూట్ పాటకైనా ఎంతోమంది అమ్మాయిలు డ్యాన్స్ వేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇదే పాటకు మహేష్ తనయ సితార డ్యాన్స్ వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎక్కడ చూసినా సితార క్యూట్ స్టెప్పులే దర్శనమిస్తున్నాయి. ఇక ఈ వీడియోను చూసిన మహేష్ అభిమానులు షి ఈజ్ సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఆ వీడియో మీరు చూసేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news