విజయ్ దేవరకొండ ‘మజిలీ’ కథ

-

నిన్ను కోరి సినిమాతో ప్రతిభ చాటుకున్న డైరక్టర్ శివ నిర్వాణ సెకండ్ మూవీగా చేసిన మజిలీ కూడా అతనికి సూపర్ సక్సెస్ అందుకుంది. ఏప్రిల్ 5న ఉగాదికి ఓరోజు ముందు వచ్చిన మజిలీ సినిమా చైతు, సమంతల కెరియర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది. ఇప్పటికే నాలుగు రోజుల వసూళ్లతో చిత్రయూనిట్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చూస్తున్నాడట.

ఆల్రెడీ స్క్రిప్ట్ పూర్తయిందట.. విజయ్ తో ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ ముగిశాయని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ విషయానికొస్తే ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉండగా ఆ తర్వాత క్రాంతి మాధవ్ సినిమా చేయాల్సి ఉంది. ఇవే కాకుండా తమిళ దర్శకుడు ఆనంద్ అన్నమలై డైరక్షన్ లో ఓ సినిమా ఒప్పుకున్నాడు. ఇవన్ని చేశాక కాని శివ నిర్వాణతో విజయ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా శివతో విజయ్ సినిమా మరో క్రేజీ సినిమా అవుతుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news