చెప్పినవి చేసి చూపించండి.. నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మాజీ అధ్యక్షుడు శివాజి రాజా, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నూతన అధ్యక్షుడిగా తనని ఆ చెయిర్ లో కూర్చోకుండా శివాజి రాజా అడ్డుపడుతున్నాడని.. ఎల్.ఐ.సి కి సంబందించిన రెన్యువల్స్ చేయలేదని మొన్న శివాజి రాజా మీద నరేష్ ఆరోపణలు చేశాడు. అయితే దీనికి రెస్పాన్స్ గా ఈరోజు శివాజి రాజా మరో ప్రెస్ మీట్ పెట్టి నరేష్ మీద రివర్స్ లో కౌంటర్లు వేశారు.

మార్చి 31 వరకు మా అధ్యక్షుడిగా కాలపరిమితి ఉందని.. ఎల్.ఐ.సి గురించి నరేష్ చెప్పినది హెల్త్ ఇన్స్యూరన్స్ అని.. అది కూడా తానే ప్రవేశ పెట్టానని అన్నరు శివాజి రాజా. ఇక ప్రెస్ వాళ్ల ముందు మహేష్ ను తీసుకెళ్లి ఎక్కడైనా ఓ షో చేసి 2 కోట్లు ‘మా’కి తీసుకుని రా.. అప్పుడు నేనే నీ దగ్గరకు వచ్చి మెడలో దండ వేస్తానని చెప్పుకొచ్చాడు శివాజి రాజా. మహేష్ తో ప్రోగ్రాం అని 4 నెలలు కానిచ్చాడు.. మరో 3 నెలలు టైం ఇస్తున్నా మహేష్ తో కాని మరో హీరోతో కాని ‘మా’ కి 2 కోట్లు తెచ్చే సత్తా ఉందా అంటూ ఛాలెంజ్ విసిరాడు శివాజి రాజా.

అతనేదో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయినట్టు వేళ్లు చూపిస్తూ మాట్లాడితే ఎవరు ఊరుకోరని.. మీరు మేనిఫెస్టోలో చెప్పినవన్ని చేసి చూపించి అప్పుడు మాట్లాడండి అని అన్నారు శివాజి రాజా. ఓల్డేజ్ హోం కట్టిద్దామని అనుకుంటే ఎవడో భీమవరం నుండి వచ్చి ఓల్డేజ్ హోం కట్టిస్తే మనమంతా ఎందుకని అనుకున్నారు. అందుకే అది వెనుక పడ్డదని.. ఈ విషయంలో చిరంజీవి గారు తనకు చాలా హెల్ప్ చేశారని.. కె.టి.ఆర్ తో మాట్లాడి స్థలం కూడా ఇప్పిస్తానన్నారని చెప్పుకొచ్చాడు శివాజి రాజా.

తన ఓటమికి ఓల్డేజ్ హోమే కారణమని అన్నారు శివాజి రాజా. మెగా బ్రదర్ నాగబాబు నరేష్ కు సపోర్ట్ చేయడం పట్ల స్పందించిన శివాజి రాజ. నాగబాబుకి నాకు 30 ఏళ్ల స్నేహం ఉందని ఆయన గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి త్వరలో నేను నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు శివాజి రాజా. అదేంటి అన్నది మాత్రం చెప్పలేదు. ఎలక్షన్స్ తర్వాత కూడా మూవీ మార్టిస్ట్ అసోసియేషన్ లో గొడవ కొనసాగుతుంది. నరేష్, శివాజి రాజా ఇద్దరు మాట్లలతో ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటున్నారు. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.