జూ ఎన్టీఆర్ సీక్రెట్స్ చెబితే కొంత మంది బాక్స్ బద్దలే..!

-

ప్రస్తుతం వున్న హీరోలలో  జూనియర్ వరస విజయాలతో మంచి జోరుమీదున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా RRR  వల్ల తన పేరు ప్రపంచమంతటా మారు మోగి పోయింది. జూ ఎన్టీఆర్ వాన్ లోంచి జంతువుల తో దూకే సీన్ హాలీవుడ్ వాళ్ళను అబ్బురపరిచింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో లక్షల మంది చూశారు. తన నటనకు ఆస్కార్ నామినేషన్ కూడా లభిస్తుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ప్రస్తుతం తాను కొరటాల శివ దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం తన మీద పొలిటికల్ యాంగిల్లో కొంత మంది వెనకబడి మరీ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఈ కామెంట్ల గురించి జూ ఎన్టీఆర్ ఏమి మాట్లాడటం లేదు. ఎందుకంటే అనవసరంగా మాట్లాడి ప్రతి విషయంలో ఇబ్బంది పడకూడదని భావిస్తున్నాడు.కాని తన మిత్రుడు అయిన వల్లభనేని వంశీ ఈ కామెంట్ల పై ఆసక్తికరంగా స్పందించారు. తారక్ ఏ విషయంలోను  ఎవరూ సాయం చేయలేదని, తాను కష్టపడి తన టాలెంట్ తో పైకి వచ్చారని వల్లభనేని వంశీ వెల్లడించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో అనేక సీక్రెట్స్ ఉన్నాయని ఆయన తెలిపారు.

ఆ రహస్యాలను బయటకి చెబితే కొంత మందికి  నెత్తి మీద బాంబ్ వేసినట్లుగా వుంటుందని చెప్పారు. చాలా మంది తారక్ కు చాలా సహాయం చేశామని చెప్పుకుంటారని వాస్తవంగా ఇందులో అస్సలు నిజం లేదని అన్నారు. జూ ఎన్టీఆర్ పెళ్లి తామే స్వయంగా చేసినట్లు కొంత మంది బిల్డప్ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. టిడిపికి ఎన్నికల్లో ప్రచారం చేస్తే గౌరవం ఇవ్వలేదని, తర్వాత పవన్ కళ్యాణ్ రావడంతో పక్కన పడేసారని వంశీ అన్నారు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్  పొలిటికల్ విషయాల మీద మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు. కొంత మంది అమరావతి ఇష్యూ ని జూ ఎన్టీఆర్ కు చుడదామని చూస్తున్నారని, ఆయనకు ఈ విషయంతో సంబందం లేదని అన్నారు. తారక్ ను అవమానించిన విషయం గురించి చెబితే అగ్గి రాజుకుంటుంది అని, అది నాకు ,తారక్ కు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news