‘థ్యాంక్యూ’ మూవీ నుంచి అదిరిపోయే సాంగ్ రిలీజ్

-

వరుస హిట్లతో జోరుమీదున్న నాగ చైతన్య ఖాతాలో మరో హిట్‌ పడనున్నట్లు కనిపిస్తోంది. లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్లు కొట్టిన చైతు ఇప్పుడు ‘థ్యాంక్యూ’ సినిమాతో హ్యట్రిక్ హిట్‌ కొట్టేటట్లు టీజర్‌ చూస్తుంటే అనిపిస్తోంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది.

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉండగా తాజాగా థాంక్యూ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్రబృందం. ఫేర్వెల్ అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సాంగ్ లో నాగ చైతన్య తన అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news