పాలిటిక్స్ లోకి వెళ్ళను..నాకు ఇంట్రెస్ట్ లేదు – సోనూసూద్‌

-

పాలిటిక్స్ లోకి వెళ్ళను..నాకు ఇంట్రెస్ట్ లేదని సోనూసూద్‌ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమ 12వ హాస్పిటల్ ప్రారంభించనుంది అంకుర హాస్పిటల్స్. అయితే.. ఈ కార్యక్రమానికి సోనూసూద్‌ హాజరై మాట్లాడారు. కరోనా ప్యాండమిక్ సమయంలో చాలా హాస్పిటల్స్ కి వెళ్లాను.. జనాల పరిస్థితి చూస్తుంటే చాలా బాధనిపించేదన్నారు.

కరోనా సమయంలో నాస్థోమతకు తగిన సేవ చేశాను, ఇంకా చేస్తున్నాను..అంకుర హాస్పిటల్స్ చాలా మంచి సేవలను అందిస్తుందని వెల్లడించారు. సంవత్సరం కాలంగా అంకుర హాస్పిటల్స్ తో నాకు అనుబంధం ఉంది.. ప్యాండమిక్ సమయంలో అంకుర హాస్పిటల్స్ తో కలిసి పని చేసామన్నారు.

ఇతర రాష్ట్రాలకు అంకుర విస్తరణ అనేది ఎంతో మందికి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ఉపయోగపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించాలని అనుకుంటున్నాను.. నేను సినిమాలు సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. సేవ చేయడానికి పవర్ కాదు, దేవుడి దయ ఉండాలి.. దేశంలో అందరూ ముందు ఉండాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news