ట్రెండ్ ఇన్: దక్షిణ భారతీయుడా గర్వపడు..సినిమా ఖ్యాతిని పెంచుతున్న దర్శకులు

-

భారత దేశంలో అతిపెద్ద చిత్ర పరిశ్రమ బాలీవుడ్ అని ప్రచారంలో ఉండేది. కానీ, బాలీవుడ్ ను మించిన మార్కెట్ దక్షిణ భారతదేశంలో ఉందని గతంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చెప్పారు. అయినప్పటికీ బీ టౌన్ సినిమా మార్కెట్ ఎక్కువగా ఉంటుందని, హిందీ ఇండస్ట్రీలో హిట్ అయితేనే చక్కటి విజయమనే అభిప్రాయం ఉండేది. కానీ, ఆ బ్యారియర్స్ అన్ని ఇప్పుడు బ్రేక్ అయ్యాయి.

దక్షిణ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన సినిమాలు నార్త్ ఇండియాలో చక్కటి విజయాలు సాధిస్తున్నాయి. అంతటితో ఆగకుండా దేశవ్యాప్తంగా ప్రజల విశేష ఆదరణ పొందుతున్నాయి. అలా దక్షిణ భారతదేశ సినిమాలు ఇప్పుడు బాగా ఆడుతున్నాయి. ఇటీవల కాలంలో విడుదలైన ‘పుష్ప, RRR, KGF2’ బాలీవుడ్ బాక్సాఫీసు రికార్డులన్నిటినీ తిరగరాస్తున్నాయి.

భవిష్యత్తులో ప్రాంతీయ రేఖలు అనేవి లేకుండా భారతీయ చిత్ర పరిశ్రమ అంటే ఒక్కటే అనే పరిస్థితులు వస్తాయని ఈ సందర్భంగా పలువురు సినీ పరిశీలకులు అంటున్నారు. తెలుగు దర్శకులు సుకుమార్, రాజమౌళి తో పాటు కన్నడ దర్శకులు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు మంచి గుర్తింపు లభించింది.

ఈ క్రమంలోనే మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ట్విట్టర్’లో “South Indian” పదాన్ని నెటిజన్లు ట్వీట్ చేశారు. అలా ఈ పదం ట్రెండింగ్ లోకి వచ్చింది. సౌత్ ఇండియన్ సినిమాటిక్ యూనివర్స్ వెరీ డిఫరెంట్ గా ఉంటుందని, గ్రాండియర్ గా ఉంటుందని అందుకు సంబంధించిన ఫొటోలను నెటిజన్లు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు. రవీనా టండన్, రమ్యకృష్ణలకు సినిమాల్లో ఇచ్చిన శక్తిమంతమైన పాత్రల పోస్టర్లను ట్వీట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news