ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడాలి అంటే ముందు సరికొత్త రాజకీయం చెయ్యాల్సిన అవసరం ఉంది. అంతే గాని పాత పద్దతిలో రాజకీయం చేయడం అనేది ఆ పార్టీకి అంత మంచిది కాదు అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే ఎక్కువగా వినపడుతుంది. ముఖ్యంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద కసరత్తులు చెయ్యాల్సిన అవసరం ఉంది. అంతే గాని ఇలాగే రాజకీయం చేస్తా అంటే కష్టం.
ప్రజా చైతన్య యాత్ర అన్నారు బాగానే ఉంది. ఆ యాత్రను ఉత్తరాంధ్ర లో చెయ్యాల్సిన అవసరం ఇప్పుడు లేదు. రాయలసీమ సహా కీలక ప్రాంతాల్లో చేసుకోవాల్సిన అవసరం ఆ పార్టీ ముందు ఉంది. అది పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా రాజకీయం చేస్తే పార్టీ ఇబ్బంది పడటం ఖాయం. అనవసరంగా ఉత్తరాంధ్ర వెళ్ళారు చంద్రబాబు. దీనితో అక్కడ వ్యతిరేకత వచ్చింది. అడ్డుకుంది వైసీపీ కార్యకర్తలా మరోకరా అనేది పక్కన పెడితే,
అడ్డుకుంది ప్రజలే అనే అభిప్రాయం ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది. దీనితో పార్టీ ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అనవసరంగా చంద్రబాబు ఉత్తరాంధ్ర వచ్చారని అక్కడ పార్టీ సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. దీనితో గొడవకు కావాలనే వచ్చినట్టు ఉందని, ఇప్పుడు జగన్ ని తిడితే వచ్చే లాభం ఏంటి అని, అనుకూల మీడియా ఏ కథనాలు రాస్తే ఏమవుతుందని అంటున్నారు.
తాజాగా యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు ఇదే విషయాన్ని చంద్రబాబు ముందు ప్రస్తావించారట. ఎందుకు అసలు విశాఖ వచ్చారని ఆయన ముందే అడిగేసారట టీడీపీ సీనియర్లు. పార్టీ ఇప్పుడు అనవసరంగా ఇబ్బంది పడే పరిస్థితి మీరే తీసుకొచ్చారని, ఇది పార్టీకి అంత మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారట. దీని బదులు మరో ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది అంటూ వ్యాఖ్యానించారట.