శ్రీదేవి బంగ్లా.. నిజంగా శ్రీదేవి డెత్ మిస్టరీలా ఉందే..!

అందాల తార శ్రీదేవి డెత్ మిస్టరీ ఇప్పటికి ఓ సస్పెన్సే.. దుబాయ్ లో పెళ్లికి అటెండ్ అవుదామని వెళ్లిన ఆమె బాత్ టబ్ లో శవమై తేలడం అందరిని ఆశ్చర్యపరచింది. స్నానానికి అని వెళ్లి గుండెపోటు రావడం వల్ల ఆమె మరణించిందని ప్రకటించారు. అయితే శ్రీదేవి మరణం ఆమె ఫ్యాన్స్ కు ఓ పెద్ద షాక్. ఆమె మరణం పట్ల రకరకాల అభియోగాలు ఉన్నాయి.

అయితే ఇలాంటి టైంలో శ్రీదేవి బంగ్లా అంటూ ఓ సినిమా రాబోతుంది. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ప్రశాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి వచ్చిన రెండో టీజర్ సినిమాపై మరింత క్రేజ్ తీసుకొచ్చింది. నీకు ఎంతమంది ప్రపోజ్ చేశారో తెలుసా..? అని హీరోయిన్ ఒక వ్యక్తితో అంటుంది.. మరో వ్యక్తి దునియా మొత్తం నీ న్యూడ్ వీడియో చూస్తుంది అని బెదిరిస్తాడు.

శ్రీదేవి లైఫ్ కు ఈ సినిమాకు సంబందం లేకున్నా శ్రీదేవి పేరుతో టైటిల్ ఉండటం.. మొదటి టీజర్ లో బాత్ టబ్ లో హీరోయిన్ పడిపోవడం చూస్తుంటే శ్రీదేవి డెత్ సీక్రెట్ కు ఈ సినిమాకు లింక్ ఉందని అనుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.