సాధారణంగా.. పాములను, తేళ్లను, ఇంకా ఇతర కీటకాలను కూడా కొన్ని దేశాల్లో తింటారు. అది వాళ్ల అలవాటు. ఇలాగే ఓ వ్యక్తి పందెం కాచి బల్లిని తిన్నాడు. కానీ.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది.
బల్లి.. ఇది అందరి ఇళ్లలో ఉంటుంది. కానీ.. దీన్ని చూస్తేనే మన ఒళ్లు జలదరిస్తుంది. పిల్లలైతే బల్లిని చూసి లాగు తడిపేసుకుంటారు. బల్లి ఒళ్లంతా విషం ఉంటుంది అని చెబుతుంటారు. అందుకే.. అది ఇంట్లో ఉంటే.. దాన్ని ఎలాగోలా బయటికి వెళ్లగొడుతుంటారు.
సాధారణంగా.. పాములను, తేళ్లను, ఇంకా ఇతర కీటకాలను కూడా కొన్ని దేశాల్లో తింటారు. అది వాళ్ల అలవాటు. ఇలాగే ఓ వ్యక్తి పందెం కాచి బల్లిని తిన్నాడు. కానీ.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది.
డేవిడ్ డావెల్ అనే వ్యక్తికి పందెం కాయడం అంటే మహా సరదా. అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి పందెం కాస్తూ ఉంటాడు. పచ్చి మాంసం తినడం, పచ్చి చేపలు తినడం డేవిడ్‌కు అలవాటు. పందెం కాసి వాటిని తిని… పందెం గెలిచేవాడు.
అయితే.. ఎప్పుడూ పచ్చి మాంసం తినడం, పచ్చి చేపలు తినడం కాకుండా.. ఈసారి వెరైటీగా ట్రై చేస్తానని తన స్నేహితులతో పందెం కాశాడు డేవిడ్. వెంటనే అత్యంత ప్రమాదకరమైన గెక్కో అనే జాతికి చెందిన బతికున్న బల్లిని తీసుకొచ్చి.. దాన్ని తినేస్తానంటూ స్నేహితులకు చెప్పాడు. స్నేహితులు మాత్రం వద్దు… అది విషపూరితమైంది.. అంటూ వారించినా వినలేదు.
బతికున్న బల్లిని కరకరా నమిలి మింగేశాడు. ఆరోజు బాగానే ఉన్న డేవిడ్‌కు.. తెల్లారి కడుపులో తిప్పినట్టు అయింది. దీంతో వెంటనే హాస్పిటల్‌కు పరిగెత్తాడు. అయితే.. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. డేవిడ్ అవయాలన్నింటికీ.. బల్లి విషం పట్టేసింది. సల్మోనెల్లా అనే ఇన్ఫెక్షన్ సోకింది. డేవిడ్ కడుపులోని పేగులు చిట్లిపోయాయి. దీంతో ఆహారమంతా ఊపిరితిత్తుల్లోకి చేరి డేవిడ్ మృతి చెందాడు.