మంచు హీరోతో శ్రీను వైట్ల..!

స్టార్ ఛాన్సులు ఇచ్చినా సరిగా వాడుకోలేని శ్రీను వైట్ల బ్రూస్ లీ నుండి అమర్ అక్బర్ ఆంటొని వరకు వరుస ఫ్లాపులు ఎదుర్కున్నాడు. యువ దర్శకులంతా సత్తా చాటుతుంటే శ్రీను వైట్ల మాత్రం వెనుకపడ్డాడు. ఆయన సినిమా అంటే హీరోలు సైతం వెనక్కి తగ్గే పరిస్థితి కనబడుతుంది. ఇదిలాఉంటే మంచు హీరోతో శ్రీను వైట్ల సినిమా కన్ ఫాం చేశాడని తెలుస్తుంది.

మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణుకి కెరియర్ లో మొదటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్ల ఢీ సినిమాతో విష్ణుకి అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇది ఢీ సీక్వల్ గా ఉంటుందని అంటున్నారు. కాంబినేషన్ కలిసింది కాబట్టి అలా అంటున్నారా లేక నిజంగానే మంచు విష్ణుతో శ్రీను వైట్ల ఢీ సీక్వల్ చేస్తాడా అన్నది చూడాలి.