ఎన్టీఆర్‌తో రాజ‌మౌళి ఇంత డిజ‌ప్పాయింట్ అయ్యాడా… జ‌క్క‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

-

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – రాజమౌళి ఎంత సక్సెస్ ఫుల్ కాంబినేషనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టింది. య‌మ‌దొంగ సినిమా వ‌చ్చి కూడా 13 ఏళ్లు అయ్యింది. మ‌ధ్య‌లో ఎన్టీఆర్ తిరుగులేని హీరో అయితే రాజ‌మౌళి ఏకంగా బాహుబ‌లి సినిమాల‌తో తెలుగు సినిమా ఖ్యాతిని ఏకంగా ఎల్ల‌లు దాటించేశాడు. మ‌ళ్లీ ఇన్ని సంవ‌త్స‌రాల‌కు వీరిద్ద‌రి కాంబోలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తెర‌కెక్కుతోంది.

రాజ‌మౌళి బాహుబలి సీరిస్ సినిమాల త‌ర్వాత తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో పాటు ఇటు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా ఈ సినిమాలో మ‌రో హీరోగా న‌టిస్తుండ‌డం.. చారిత్ర‌క ప్రాధాన్యం ఉన్న సినిమా కావ‌డంతో ఆర్ ఆర్ ఆర్‌పై మామూలుగా అంచ‌నాలు లేవు. తాజాగా క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో రాజ‌మౌళి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమా టైంలో జ‌రిగిన కొన్ని విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు.

ఆ సినిమా చేస్తోన్న‌ సమయంలో ఎన్టీఆర్ వయసు 19 సంవత్సరాలు.ఇంకా మీసాలు కూడా రాలేదు. లావుగా ఉండేవాడు. హెయిర్ స్టైల్ బాగుండేది కాదు. కనీసం పర్సనల్ గ్రూమింగ్ కూడా అతినికి తెలియదు. సో.. నా తొలి సినిమాకు ఇలాంటి హీరో దొరికాడేంటి అని చాలా డిసప్పాయింట్ అయ్యాన‌ని ఏకంగా బాంబు పేల్చాడు. అయితే ఇంట‌ర్వెల్ షూట్ చేస్తోన్న టైంలో ఎన్టీఆర్ చెపుతోన్న డైలాగులు చూసి షాక్ అయ్యాన‌ని.. అత‌డిలో ఏదో ఒక ప్ర‌త్యేక‌త ఉంద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాన‌ని చెప్పాడు.

ఏదేమైనా ముందుగా రాజ‌మౌళి ఎన్టీఆర్‌ను అంచ‌నా వేయ‌డంలో పొర‌ప‌డ్డాడ‌ని ఆయ‌న మాట‌ల ద్వారా అర్థ‌మ‌వుతోంది. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమా విషయానికి వచ్చేసరికి పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news