వెంకటేశ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాన్ని తిరస్కరించిన స్టార్ హీరో.. కారణమిదే..!

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’ ప్రతీ ఒక్కరి ఫేవరెట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇందులో వెంకీ కామెడీ టైమింగ్, డైలాగ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఇప్పటికీ ఈ పిక్చర్ టీవీల్లో వస్తే జనాలు టీవీలకు అతుక్కుపోయి మరీ చూసేస్తుంటారు.

ఘన విజయం సాధించిన ఈ మూవీకి హీరోగా తొలుత విక్టరీ వెంకటేశ్ ను అనుకోలేదు. ఓ స్టార్ హీరోను అనుకోగా, ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ స్టోరి వెంకటేశ్ వద్దకు వచ్చింది. ఆయన కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. ఇందులో హీరోయిన్ గా దివంగత ఆర్తి అగర్వాల్ నటించింది. బ్రహ్మానందం, సునీల్, ఎం.ఎస్.నారాయణ, ప్రకాశ్ రాజ్ ల కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి.

ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. శ్రీ సవంతి మూవీస్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సురేశ్ బాబు, స్రవంతి రవికిశోర్ సంయుక్తంగా మూవీని ప్రొడ్యూస్ చేశారు. కోటి మ్యూజిక్ అందించారు.

ఈ సినిమాలో హీరోగా లవర్ బాయ్ ఇమేజ్ తో అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న తరుణ్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. కానీ, అప్పటికే ‘నువ్వే కావాలి’ చిత్రంతో సక్సెస్ అందుకున్న తరుణ్…నెక్స్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

తాను ఇప్పుడు ఖాళీగా లేననే కారణంతో ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాను రిజెక్ట్ చేశాడట హీరో తరుణ్. అలా ఈ స్టోరి వెంకటేశ్ వద్దకు వచ్చింది. దాదాపు 60 థియేటర్లలో వెంకటేశ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం వంద రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది. మొత్తంగా తరుణ్ రిజెక్ట్ చేసిన స్టోరితో వెంకటేశ్ ఘన విజయం అందుకున్నాడు.