నాగార్జున వర్సెస్ సుమంత్.. క్వైట్ ఇంట్రెస్టింగ్

-

అక్కినేని వారసుడు కింగ్ నాగార్జున, అతని మేనళ్లుడు సుమంత్ ఇద్దరి మధ్య వ్యవహారం చెడిందని ఈమధ్య టాక్. సుమంత్, నాగ్ ల మధ్య దూరం పెరిగిందని ఫిల్మ్ నగర్ టాక్. అందుకే సుమంత్ మళ్లీ రావా హిట్ అందుకున్నా జస్ట్ ఒక్క ట్వీట్ తో సినిమా గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు నాగార్జున.

అంతేకాదు ఎన్.టి.ఆర్ బయోపిక్ లో సుమంత్ ఏయన్నార్ గా నటించడం కూడా నాగార్జునకు నచ్చలేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 27న దేవదాస్ సినిమాతో పోటీగా సుమంత్ నటిస్తున్న ఇదం జగత్ సినిమా వదులుతున్నారు. నాగార్జు, నాని కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్.

ఆ సినిమాకు పోటీగా సుమంత్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఇదం జగత్ ను రిలీజ్ చేస్తున్నారు. ఎంత గొడవలున్నా ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడం వారి ఫ్యాన్స్ కు అగ్నిపరీక్ష లాంటిది. సెప్టెంబర్ 13న వినాయక చవితి నాడు కూడా చైతు శైలజా రెడ్డి అల్లుడుకి పోటీగా సమంత యూటర్న్ సినిమా వస్తుంది. అక్కినేని ఫ్యామిలీల అండర్ స్టాండింగ్ ఏంటన్నది మాత్రం అర్ధం కావట్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news