బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ అట్టహాసంగా ముగిసింది. వందరోజుల పాటు తెలుగు ప్రేక్షకులకి వినోదాన్నందించిన నాలుగవ సీజన్ పూర్తయ్యింది. ఈ సీజన్లో అభిజిత్ టైటిల్ గెలుచుకోగా, అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. మూడవ స్థానంలో తప్పుకున్న సోహైల్, 25లక్షలతో తప్పుకున్నాడు. ఐతే ఈ వందరోజుల్లో ఎన్నో ఎత్తు పల్లాలున్నప్పటికీ ఫినాలే ఎపిసోడ్ మాత్రం గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అతిధిగా రావడం, మెహ్రీన్, ప్రణీత.. హీరోయిన్ల డాన్సులతో బిగ్ బాస్ స్టేజి దద్దరిల్లి పోయింది.
ఐతే ఈ మెగా ఎపిసోడ్ కి స్టార్ మా యాజమాన్యం ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఒక్క ఫినాలే ఎపిసోడ్ కే 2.5కోట్లు ఖర్చు పెట్టారట. ఇంత మొత్తంలో ఖర్చు పెట్టినందుకు ఫలితం ఉందనే చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆద్యంతం ఆసక్తిగా బిగ్ బాస్ సాగింది. హీరోయిన్ల డాన్సులతో పాటు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్ బాస్ స్టేజిపై సందడి చేసాడు. మొత్తానికి బిగ్ బాస్ నాలుగవ సీజన్ విజయవంతంగా పూర్తయ్యింది.