అలీ కూతురి పెళ్లిలో మెరిసిన తారలు..!

ప్రముఖ నటుడిగా.. కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆలీ , జుబేదాల కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం రోజు హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి చిరంజీవి, నాగార్జున సతీసమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నటి రోజా సైతం పెళ్లి వేడుకలలో తలుక్కుమని మెరిసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా తన కూతురి పెళ్లికి రావాలంటూ.. ఆలీ భార్య జుబేదాను వెంటపెట్టుకొని ఇండస్ట్రీ మిత్రుల ఇంటికి వెళ్లి స్వయంగా శుభలేఖలు అందించాడు. నగల షాపింగ్ నుంచి హల్దీ ఫంక్షన్ వరకు అన్నింటినీ కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు పెళ్లి పనులను అప్డేట్ ఇస్తూ వచ్చింది జుబేదా..

మొత్తానికి అయితే ఆలీ కూతురి వివాహానికి సంబంధించిన పెళ్లి ఫోటోలు బాగా వైరల్ అవ్వడమే కాకుండా మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిన్నపాటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆలీ విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలలో కమెడియన్ గా నటిస్తూనే.. గతంలో హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.. ఆ తర్వాత పలు షోలకు గెస్ట్ గా వ్యవహరించిన ఈయన ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా హోస్ట్ గా వ్యవహరిస్తూ కనుమరుగైన సెలబ్రిటీలను కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాడు.

ప్రస్తుతం సినిమాలలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అడపాదడపా పాత్రలలో కమెడియన్గా నటిస్తూ మరింత పాపులారిటీని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇలా కూతురి పెళ్లి చేసి బాధ్యతను నెరవేర్చుకున్నాడు. మొత్తానికైతే కూతురు పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట బాగా సందడి చేస్తున్నాయి మీరు కూడా చూసేయండి.