ఫిలిం ఇండస్ట్రీలో ముగిసిన సమ్మె.. రేపటి నుంచి యధావిధిగా షూటింగులు: ఫిల్మ్ ఫెడరేషన్

-

తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ టాలీవుడ్ సినీ కార్మికులు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి అన్ని రకాల షూటింగులకు కార్మికులు దూరంగా ఉంటున్నామని నిర్ణయించుకున్నారు. ఫిలిం ఫెడరేషన్ లో 24 క్రాఫ్టుల్లో జీతాలు పెంచాల్సి ఉంది. ఈ వ్యవహారం చాన్నాళ్లుగా పెండింగ్లో ఉంది. కరోనా వల్ల రెండేళ్లు ఆలస్యమైంది. ఇప్పటికైనా తమ గోడును సినీ పెద్దలు వినిపించుకోవాలని సినీ కార్మికులు కోరుతూ సమ్మెకు దిగారు.

కాగా గురువారం రోజు సమ్మె విరమించుకుంటున్నట్లు ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది. రేపటి నుంచి యధావిధిగా షూటింగులు ప్రారంభమవుతాయని తెలిపింది. విధి విధానాలపై చర్చలు జరుగుతూ ఉంటాయని తెలిపింది. సుదీర్ఘ చర్చల అనంతరం నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన ఓ ఆర్డినేషన్ కమిటీని వేసామని తెలిపారు. ఈ కమిటీఏ వేతనాలు నిర్ణయిస్తుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news