‘స్పైడర్ మ్యాన్​’కు శుభ్‌మన్‌ గిల్‌ డబ్బింగ్‌

-

స్పైడర్ మ్యాన్ సినిమాలంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ చిత్రాలంటే భలే ఇష్టం. ఇక ఈ మధ్య హాలీవుడ్ చిత్రాలకు నేటివిటీని కాస్త జోడించాలని.. లోకల్ గా ఫేమస్ నటులతో డబ్బింగ్ చెప్పిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా స్పైడర్ మ్యాన్ సినిమా కోసం డబ్బింగ్ చెప్పడానికి ఏకంగా ఓ క్రికెటర్ ని చూజ్ చేసుకున్నారు.

టీమ్​ఇండియా యువ బ్యాట్స్‌మెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రీసెంట్​గా కొత్త అవతారం ఎత్తాడు. తాజా ఐపీఎల్‌ సీజన్‌లో అదరగొడుతున్న ఈ గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌.. సినిమా రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తెరపై కనిపించే నటుడిగా కాకుండా.. ఓ హాలీవుడ్‌ యానిమేషన్ చిత్రానికి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారాడు. ఇండియన్‌ స్పైడర్‌మ్యాన్‌ పాత్రకు గిల్‌ తన గాత్రాన్ని అందించాడు.

ఆ సినిమా పేరే ‘స్పైడర్ మ్యాన్ – ఎక్రాస్ ది స్పైడర్ వర్స్’. అయితే తాజాగా మూవీటీమ్​.. ముంబయిలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి.. భారతీయ భాషల్లో దానికి సంబంధించిన ట్రైలర్​ను రిలీజ్​ చేసింది. క్రికెటర్​ గిల్‌ చేత విడుదల చేయించింది. అందులో అతడు పంజాబీ, హిందీ భాషలకు డబ్బింగ్ చెప్పాడు. కాగా, సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని జూన్‌ 1న.. తెలుగు సహా 10 భాషల్లో విడుదల చేయనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news