నన్ను దోచుకుందువటే ట్రైలర్.. సుధీర్ బాబు హిట్టు కొట్టేలా ఉన్నాడు

-

సుధీర్ బాబు, నభా నటేష్ లీడ్ రోల్స్ గా ఆర్.ఎస్ నాయుడు డైరక్షన్ లో వస్తున్న సినిమా నన్ను దోచుకుందువటే. టీజర్ తో సినిమాపై ఆసక్తి పెంచిన ఈ మూవీ ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ పాటని టైటిల్ గా పెట్టుకున్న సుధీర్ బాబు సినిమాతో అదే రేంజ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నాడు. టీజర్ మాత్రమే కాదు ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసింది.

సుధీర్ బాబు స్ట్రిక్ట్ ఎంప్లాయ్ గా కనిపిస్తుండగా.. హీరోయిన్ షార్ట్ ఫిల్మ్ కథానాయికగా అలరిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా సాగింది అన్నది సినిమా కథ. సెప్టెంబర్ 21న రిలీజ్ అవనున్న ఈ సినిమా ట్రైలర్ ఫ్రెష్ గానే ఉంది. కచ్చితంగా అంచనాలను అందుకునేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా విషయంలో మరో స్పెషల్ ఏంటంటే ఎస్బి ప్రొడక్షన్ లో సుధీర్ బాబు స్వయంగా ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.

మొత్తానికి సుధీర్ మొదటి అటెంప్ట్ సక్సెస్ అయ్యేలానే ఉంది. అసలైతే వినాయక చవితి సందర్భంగా చైతు, సమంతల సినిమాలకు పోటీగా వద్దామని అనుకున్నా అలా ఎందుకని ఓ వారం వాయిదా వేసుకున్నాడు సుధీర్ బాబు. సెప్టెంబర్ సినిమాల సందడిలో సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే ఏవిధంగా ప్రేక్షకులను మనసులను గెలుస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news