పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన సుడిగాలి సుధీర్..!

-

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో ల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులకు దగ్గరైన సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కానీ ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగులతో యువతను బాగా ఆకట్టుకున్న సుడిగాలి సుదీర్ అదే క్రేజ్ తో సినిమాలలో కూడా అవకాశాన్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా సుడిగాలి సుధీర్ ను .. ఆయన ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ముద్దుగా స్మాల్ స్క్రీన్ పవర్ స్టార్ గా పిలుచుకుంటున్నారు..

ఇకపోతే సుధీర్ , రష్మీ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. వారిని అన్న, వదినగా భావిస్తారు . వీరిద్దరూ కలిసారు అంటే ఆ స్కిట్ కి మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తూ ఉంటాయి. అయితే నిజజీవితంలో కూడా వీరు పెళ్లి చేసుకోవాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. కేవలం స్కిట్ కోసమే జంటగా నటించడం లేదు అని , వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమ ఉందని అభిమానులు కూడా నమ్ముతున్నారు. అంతే కాదు వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయాలని కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై సుదీర్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తాజాగా సుధీర్ నటించిన చిత్రం గాలోడు.. నవంబర్ 18న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రస్తావన రాగా ..అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. పెళ్లి చేసుకునే వారిని ఎప్పుడు చేసుకుంటారు ? ఎవరిని చేసుకుంటారు? అని అడగొచ్చు. కానీ నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. ప్రజలకు సేవ చేయాలని.. వారిని సంతోషంగా ఉంచాలనేదే నా కోరిక. అదే నా బాధ్యత అంటూ సుధీర్ తెలిపారు. అభిమానుల కోసం తన ఆలోచన చూచి ఒకవైపు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూనే.. మరొకవైపు పెళ్లి కూడా చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news