ఇది కదా మహేష్ స్టామినా.. మహర్షి టీజర్ 12 మిలియన్ క్రాస్..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరెక్ట్ సినిమా పడితే ఆ సినిమా వసూళ్ల లెక్క ఎంత ఉంటుందో తెలిసిందే. ప్రస్తుతం మహేష్ 25వ సినిమాగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఉగాది సందర్భంగా నిన్న రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. మహేష్ స్టామినా తెలియచేసేలా మహర్షి రికార్డ్ వ్యూస్ సాధిస్తుంది.

కేవలం టీజర్ రిలీజైన 24 గంటల్లోనే 12.6 మిలియన్ వ్యూస్ తో మహర్షి దుమ్ముదులిపేశాడు. మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మహర్షి టీజర్ లో మహేష్ స్టైలిష్ లుక్ తో పాటుగా సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. ఇట్స్ ఏ జర్నీ అంటూ అదరగొట్టే డైలాగ్ కూడా చెప్పాడు. మొత్తానికి మహేష్ నుండి మరో అద్భుతమైన సినిమా రాబోతుందని తెలుస్తుంది. మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news