నిర్మాత కే.పీ.చౌదరితో సుప్రీత.. మరీ ఇంత క్లోజా..!

-

ప్రస్తుతం నిర్మాత కే.పీ.చౌదరి పేరు ఎక్కడ చూసినా బాగా వినిపిస్తోందని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు సంచలనం సృష్టిస్తోందని చెప్పవచ్చు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు పెను దుమారం రేపుతున్న నేపథ్యంలో నిందితుడు, సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇకపోతే కోర్టు అనుమతితో పోలీసులు నిందితుడిని రెండు రోజులుగా కస్టడీకి తీసుకొని చాలా లోతుగా ప్రశ్నించగా ఎన్నో తెలియని రహస్యాలు కూడా బయటపడుతూ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి.

ఇకపోతే అతని ఫోన్లోనే కాల్స్ లిస్ట్ చూస్తే పోలీసులకే దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి. ఇకపోతే ఆయన ఫోన్లో పలువురి సెలబ్రిటీల ఫోటోలు కూడా ఉండడం.. వారందరికీ అతను విక్రయించాడా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఇలాంటి సమయంలోనే సినీనటి సురేఖ వాణి తో పాటు ఆమె కూతురు సుప్రీతా కూడా కేపీ చౌదరితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఒక పార్టీలో సురేఖ అతనికి చాలా క్లోజ్ గా ముద్దు పెడుతున్న ఫోటో మనం చూడవచ్చు. అంతేకాదు మరొక ఫోటోలో కేపీ చౌదరితో సురేఖవాణి కూతురు సుప్రీతా కూడా చాలా క్లోజ్ గా దిగిన ఫోటో వైరల్ అవుతుంది.

దీంతో ఈ తల్లి కూతుర్లు ఇద్దరికీ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో పాలుపంచుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. అయితే అతనితో వీరికి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు రహస్యంగా మారింది. తప్పు చేసినంత మాత్రాన అతనితో ఫోటోలు దిగిన వాళ్ళు కూడా తప్పు చేసినట్లేనా అని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండగా.. ఫోటోలు మాత్రమే కాదు కాల్ లిస్ట్ కూడా సురేఖ వాణి ఆమె కూతురు సంభాషణలు బయటపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ విషయంపై సురేఖవాణి ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news