మోడ్రన్ మామ్ లా కనిపించే సురేఖ అసలు వయసు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

-

ఏజింగ్ యంగ్.. ఇది అందరికీ సాధ్యమైంది కాదు అంటే వయసు పైబడుతున్న కొద్దీ మరింత యవ్వనంగా కనిపించడం.. ఇది నేచర్ అందించే గిఫ్ట్ అన్నమాట.. ముఖ్యంగా మన టాలీవుడ్ విషయానికి వస్తే ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అక్కినేని నాగార్జున అని చెప్పవచ్చు. ఆయన వయసు 63 సంవత్సరాలు అంటే నమ్మడం అసాధ్యం. ఫేస్ లో అంతే గ్లో.. స్టన్నింగ్ ఫిజిక్స్.. సూపర్ ఎనర్జీ.. మరి ఫిమేల్ నటీమణుల విషయానికి వస్తే సురేఖ వాణి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రోజురోజుకీ మరింత యంగ్ అవుతున్నారని చెప్పవచ్చు.

కూతురి వయస్సుతో పోటీపడుతూ అందాన్ని మెయింటైన్ చేస్తోంది అంటే ఆమె గ్లామర్ సీక్రెట్ ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. గతంలో హీరో హీరోయిన్స్ కి అక్క, వదిన పాత్రలు చేసిన ఈమె ప్రస్తుతం చూస్తే మాత్రం నిజంగా ఆమెను హీరోయిన్ గా పెట్టి సినిమా తీసినా సక్సెస్ అవుతుంది అని కొంతమంది అభిమానులు చెబుతున్నారు. తెలుగు, తమిళ్ భాషలో ఇప్పటివరకు 45 చిత్రాలకు పైగా చేసిన ఈమె.. అనారోగ్యంతో భర్త మరణించడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. బాధ భరించలేక సినిమాలను కూడా పక్కకు పెట్టేసింది. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోందని చెప్పవచ్చు.

తినే తిండి నుంచి.. చేసే పని వరకు ప్రతి విషయంలో కూడా ఆమె ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఇటీవల కాలంలో తన కూతురు సుప్రీతా తో కలిసి రకరకాల ఫోటోషూట్లు చేస్తూ అభిమానులను సందడి చేస్తోంది. ఇకపోతే వీరిద్దరిని పక్కన నిల్చోబెడితే అక్క , చెల్లెలు అన్నా సందేహం లేదు. ఇకపోతే ఇంత అందంగా కనిపించే సురేఖ వాణి అసలు వయసు ఎంతో మీకు తెలుసా. సురేఖ వాణి ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. విజయవాడ స్వస్థలం .. యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె నటిగా మారింది. మొత్తానికి అయితే ఈమె ఏజ్ తెలిసి ఈ ఏజ్ లో కూడా ఇంత యంగ్ గా వుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

Read more RELATED
Recommended to you

Latest news