ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ సైరా నరసింహారెడ్డిలో అనుష్క నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎలాంటి పాత్రలలో కనిపిస్తుంది? తెరపై ఆమె రోల్ ఎంత సేపు ఉండనుంది? వంటి వివరాలు మాత్రం ఇప్పటివరకూ ఎక్కడా లీక్ అవ్వలేదు. తాజాగా యూనిట్ వర్గాల నుంచి ఆ పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో అనుష్క వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో కనిపించనుందట. బ్రిటీష్ పాలకులపై ఉక్కుపాదం మోపిన ఉయ్యాలవాడతో కలిసి వీరనారి యుద్దాలు చేయనుందని అంటున్నారు. ఆ పాత్ర సినిమాలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుందని సమాచారం. అయితే చరిత్ర ప్రకారం చూస్తే వీరనారి పోరాటాలన్ని ఉత్తర ప్రదేష్ లోనిని ఝాన్సీలో సాగాయి.
1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఝాన్సీ నుంచి ఆమె పోరాంటం సాగించారు. యుద్ద సమయంలో ఎంతో మంది లోస్ఫూర్తి నింపారు. అయితే దక్షిణ భారతదేశంలో ఎక్కడా ఆమె పోరాట అనవాళ్లు లేవు. ఈ నేపత్యంలో సైరా లో ఆమె లక్ష్మీబాయ్ పాత్ర పోషించడమే అనుమానదాస్పదంగా ఉంది. కథను డ్రెమటైజ్ చేసి సౌకార్యార్దం మార్చుకుని తెరకెక్కిస్తేనే ఇలాంటి పాత్రలు మద్యలో పుట్టుకొస్తాయి. అయినా ఇది చరిత్ర కాబట్టి ఆఛాన్స్ తీసుకోవడం పెద్ద సాహసమే అవుతుంది. ఏమాత్రం తేడా కొట్టినా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి సురేందర్ రెడ్డి ధైర్యం ఏంటో సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు. ఇక సైరా ఇటీవలే కర్ణాటకలో 30 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.
దాని గురించి ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఆ బిజినెస్ వెనుక అనుష్క హస్తం కూడా ఉందని సమాచారం. అనుష్క ఓ బడా డిస్ర్టిబ్యూషన్ కంపెనీలో కొంత ఇన్వస్ట్ చేసి సైరా రైట్స్ లో భాగస్వామి అయిందంటున్నారు. ఆమె ద్వారా చిత్ర నిర్మాత రామ్ చరణ్ వద్దకు సదరు పంపిణి సంస్థ వెళ్లిందని అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు ఏంటన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం సైరా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అన్ని పనులు పూర్తి చేసి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సినిమా విడుదల చేయనున్నారు.