మెగాస్టార్ ‘ సైరా ‘ ప్రీ రిలీజ్ బిజినెస్‌

397

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న పిరియాడిక్ చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్క‌బోతుంది. చిరంజీవి 151 వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

sye raa narasimha reddy movie runtime Locked
sye raa narasimha reddy movie runtime Locked

ఈ సినిమాలో హిందీ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు, తెలుగు నటుడు జగపతిబాబు, కన్నడ నటుడు సుదీప్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, నయనతార ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం ‘సైరా’ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింద‌ట‌. అలాగే ఈ చిత్రంలో దాదాపు అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ క్యాస్టింగ్‌ ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా మంచి బజ్ ఏర్పడింది. ఈ క్ర‌మంలోనే ఇప్పటి వరకు ఆంధ్రాలోనే రూ. 80 కోట్లకు అమ్మిన‌ట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఒక సీడెడ్ ప్రాంతంలోనే సినిమా కి 22 కోట్ల ధర పలికింది. అలాగే ఉత్తరాంద్ర ప్రాంతం లో ఈ సినిమాని 14.4 కోట్లకి కొనుక్కున్నారట బయ్యర్లు. ద‌ర్శ‌క నిర్మాత‌లు గుంటూరు మరియు వెస్ట్‌లో 11.50 – 8.40 కోట్లకు అమ్మేసారట. ఆంధ్రా ప్రాంతంలో ఈ సినిమా కి దాదాపు గా 80 కోట్ల వరకు వచ్చిందని తెలుస్తోంది.

ఇక ఈస్ట్ గోదావ‌రి 10.50 కోట్లు పలికింద‌ట‌. అలాగే నెల్లూరు విష‌యానికి వ‌స్తే 4.80 కోట్లకి అమ్ముడు పోగా కృష్ణాలో దాదాపు 8.50 కోట్ల ధర పలికిందట. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి 2’, రీసెంట్‌గా వచ్చిన ‘ సాహో’ సినిమా రైట్స్ కూడా ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోలేదని.. ఈ విషయంలో చిరంజీవి ‘సైరా’ రికార్డు సృష్టించిందని సమాచారం. ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో ద‌స‌రా కానుక‌గా అక్టోబర్ 2 న విడుదల కానుంది.