‘ సైరా ‘ క‌లెక్ష‌న్లు డ్రాప్‌…. బ్రేక్ ఈవెన్ క‌ష్ట‌మే…!

-

మెగాస్టార్ చిరంజీవి 12 ఏళ్ల డ్రీమ్ సైరా నరసింహారెడ్డి భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యి ప్రేక్ష‌కుల నుంచి ఓ రేంజ్‌లో స్పంద‌న తెచ్చుకుంది. అటు విమర్శకులు… ఇటు ప్రేక్షకులు… రివ్యూవ‌ర్లు భారీ రేటింగ్లు ఇచ్చేశారు. ఇవన్నీ చూశాక సైరా టీం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాక్సాఫీస్ వద్ద సైరా దూసుకుపోతుందని మరో బాహుబలి అవుతుందని అందరూ అనుకొన్నారు. పైగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కడంతో పాటు మిగిలిన భాషల నటీనటులు కూడా సినిమాలో ఉండటంతో సైరా దూసుకుపోతుంద‌న్న అంచనాలు గట్టిగా వచ్చేసాయి.

తొలి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రు.38 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. రెండవ రోజుకే కథ అడ్డం తిరిగింది. దీంతో సైరా బ్రేక్ ఈవెన్ కావడం కనుచూపు మేరల్లో కూడా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది.పంచ వ్యాప్తంగా 74 కోట్ల షేర్ సాధిస్తే.. అందులో రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపే రు.54 కోట్లు రాబ‌ట్టింది. అంటే మిగిలిన ఏరియాల్లో మ‌రో రు.20 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. 200 కోట్ల షేర్ వసూలు చేయగలిగితే తప్ప బయ్యర్లు ఒడ్డున పడని పరిస్థితి.

సినిమా ఎంత రాబ‌ట్టినా మొత్తంగా రు.120 కోట్ల‌ను మించి షేర్ రాబ‌ట్ట‌డం క‌ష్ట‌మే అంటున్నారు. ఇక బాహుబ‌లి 1, బాహుబలి 2 సినిమాల‌తో పాటు సాహోకు ఏకంగా నెల రోజుల ముందు నుంచే భారీగా ప్ర‌మోష‌న్లు చేశారు. కానీ సైరా టీం ఈ విష‌యంలో ఫెయిల్ అయ్యింది. ఉత్త‌రాదిన బాహుబ‌లి, సాహో సినిమాల‌కు సైతం గ‌ట్టి ఫీవ‌ర్ వ‌చ్చేసింది. కానీ సైరా విష‌యంలో టీం ఫెయిల్ అయ్యింది.

సైరాలో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నా వారితో ఉత్త‌రాదిన ప్ర‌చారం చేయించుకోవ‌డంలో ఫెయిల్ అయ్యారు. సినిమా రిలీజ్ కి నాలుగు రోజుల ముందు ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లారు. ఆర్భాటం చేశారు. దీని వ‌ల్ల సినిమాకు ఎలాంటి యూజ్ అవ్వలేదు. ఫ‌లితంగా మెగా క్యాంప్ భారీగా మూల్యం చెల్లించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news