హై ‘టెక్‌’ బీచ్‌ను సందర్శించారా?

-

దేశంలోని సురక్షిత తీరాలలో మాల్పే ద్వీపం ఒకటి. సాయంత్రం సమయంలో వచ్చే సూర్యాస్తమ దృశ్యాన్ని తిలకించేందుకు స్థానికులు, పెద్ద పెక్తున యాత్రికులు తరలి వస్తుంటారు. భారతదేశ సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా, మాల్పే బీచ్‌కు ఒక సంబంధం ఉంది. అంటే చదివి మీరే తెలుసుకోండి..

దేశంలోనే వైఫై కనెక్టివిటీ గల బీచ్‌
1. ఒకరోజు వాస్కోడిగామా వాలికాట్‌కు వెళుతూ ఉండగా కొబ్బరి చెట్లతో, పచ్చని ప్రకృతితో లీనమైన ఈ ప్రదేశాన్ని చూసాడట. దాని అందాలకు ముగ్ధుడైన వాస్కోడిగామా మేరీమాత ద్వీపాలని మాల్పేకు సమీపాన ఉన్న ద్వీపానికి పేరు పెట్టాడు. అదే నేడు సెయింట్‌ ద్వీపాలుగా పిలువబడుతున్నది.
2. సెయింట్‌ మేరీస్‌ ద్వీపాలు, కొబ్బరి ద్వీపాలకు ఉన్న మరో విశేషం అక్కడి స్తంభాలు. దానికి దీనికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? స్తంభాల్లాంటి రాళ్ళ శిలలు అక్కడ కనిపిస్తాయి. ఈ రాళ్ళ శకలాలు అగ్నిపర్వతం బద్దలవటం వల్ల ఏర్పడ్డవిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
3. మాల్పే తీరం నుండి సెయింట్‌ మేరీస్‌ ద్వీపాలకు చేరుకోవడానికి ఫెర్రి, లాంచీ సదుపాయం కలదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటకులు అక్కడ సేదతీరవచ్చు. సాయంత్రం అయితే వెనుతిరగాల్సి వస్తుంది. రాత్రి వేళ అక్కడ ఉండేందుకు అధికారులు, కోస్టల్‌ సిబ్బంది అనుమతించదు.
4. దేశంలోనే వైఫై కనెక్టివిటీ ఉన్న తొలి బీచ్‌గా మాల్పే ఖ్యాతికెక్కింది. రోజులో ఎప్పుడైనా తొలి 30 నిమిషాలు ఉచితంగా ఇంటర్నెట్‌ ఉచితంగా వాడుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఈ సౌకర్యాన్ని అందిస్తున్నది.
5. దరియా బహదూర్‌ గడ్‌ కోట మాల్పే ద్వీపంలోని ఒక అందమైన ద్వీపం. చిన్నదే అయినప్పటికీ చూడడానికి సుందర ప్రదేశాలు ఉన్నాయి. మాల్పే ఇక్కడి చేరుకోవడానికి బోట్‌ సౌకర్యం ఉంది.
6. మాల్పే బీచ్‌ ప్రశాంతంగా ఉండే నీటితో, నీలాకాశాలతో చూసేవారిక అందంగా కనిపిస్తుంది. సెయింట్‌ మేరీస్‌ ద్వీపాలకు వెళ్లేటప్పుడు లేదా వచ్చేటప్పుడు ఈ ద్వీపాలను చూస్తూ ఆనందించవచ్చు. సమయం ఉందనుకుంటే ఈ బీచ్‌లో కూడా విహరించవచ్చు.
7. వాదభండేశ్వర ఆలయం శిల్పకళలకు ప్రసిద్ధి చెందినది. ఇది మాల్పే తీరానికి సమీపాన ఉంది. బలరామకృష్ణులు ఉండే ఈ ఆలయాన్ని అనంతేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. రోడ్డుపైనే ఉండే ఈ ఆలయానికి సమీప ఉడుపి నుంచి బస్సులు, ట్యాక్సీ, ఆటోలు లేదా ఏదేని ప్రవేట్‌ వాహనాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు.

మాల్పే ఎలా చేరుకోవాలి?
-మాల్పే చేరుకోవడానికి రైలు, రోడ్డు , వాయు మార్గాల సౌకర్యం ఉంది.
– మాల్పేకు సమీపాన ఉన్న విమానాశ్రయం 50 కి.మీ. దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయం. అక్కడి నుంచి క్యాబ్‌ లేదా ట్యాక్సీలలో ప్రయాణించి మాల్పే చేరుకోవచ్చు.

రైలు మార్గం
మాల్పేలో రైల్వే స్టేసన్‌ లేదు. సమీపాన 7 కి. మీ. దూరంలో ఉడుపి రైల్వేస్టేషన్‌ ఉంది. ఇది దేవంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడింది.

రోడ్డు మార్గం
ఉడుపి, మంగళూరు నుంచి మాల్పేకు నేరుగా బస్సులు లభిస్తాయి. ఉడిపి నుంచి ఆటో రిక్షాలలో కూడా మాల్పే తీరాన్ని చేరుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news