‘బాహుబలి’ మూవీపై తమన్నా సంచలన కామెంట్స్

-

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్​లో బిజీగా ఉంది. ఈ భామ నటించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరిస్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ క్రమంలోనే తమన్నా ఆ సిరీస్ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టామీ.. బాహుబలి సినిమాపై సంచలన కామెంట్స్ చేసింది. తమన్నా లేటెస్ట్ కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

‘ ‘బాహుబలి’లాంటి చిత్రాల వల్ల హీరోలకే ఎక్కువ గుర్తింపు వస్తుందన్నది నా అభిప్రాయం. అందుకే ఈ చిత్రంతో ప్రభాస్‌, రానాలు గ్లోబల్‌ స్థాయిలో సక్సెస్‌ అయ్యారు. ఇక ఈ సినిమాలో నటించిన అనుష్క, రమ్యకృష్ణలకు కూడా కొంతపేరు వచ్చినా నా పాత్ర మాత్రం అతిథి పాత్రగానే ఉండిపోయింది. అందుకే తగిన గుర్తింపు రాలేదు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్‌, రానా ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు. వాళ్లు ప్రశంసలకు అర్హులు’’ అంటూ ‘బాహుబలి’ సక్సెస్‌ను తాను క్యాష్‌ చేసుకోలేకపోయినట్లు తమన్నా భాటియా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news