ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి కేసిఆర్ గట్టిగానే కష్టపడుతున్నారు. పెద్దగా బయటకురాని కేసిఆర్..ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తూ..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని ప్రారంభిస్తున్నారు. అలాగే తమ నేతృత్వంలో బాగుపడిన తెలంగాణని మరొకరికి అప్పగించి మోసపోవద్దని, మళ్ళీ తమకే అధికారం ఇవ్వాలని జనాలని కోరుతున్నారు. అయితే గత రెండు ఎన్నికలు మాదిరిగా ఈ సారి బిఆర్‌ఎస్ సులువుగా గెలవడం కష్టం..గట్టి పోటీ ఎదురుకోవాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీతో ప్రధానంగా పోటీ ఉంటుంది. కొన్ని స్థానాల్లో బిజేపితో తలపడాలి. కాబట్టి బిఆర్‌ఎస్ పార్టీకి అధికారం అంత సులువు కాదు. కానీ కాంగ్రెస్, బిజేపిలకు లేని అడ్వాంటేజ్..బిఆర్‌ఎస్‌కు ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీకి కొన్ని జిల్లాల్లోనే పట్టు ఉంది.బిజేపికి రెండు, మూడు జిల్లాల్లోనే బలం కనిపిస్తుంది. కానీ బిఆర్‌ఎస్ పార్టీకి అన్నీ జిల్లాల్లో పత్త్ఊ ఉంది. అలాగే మొదట నుంచి బిఆర్‌ఎస్ పార్టీకి కొన్ని జిల్లాలు అండగా ఉంటూ వస్తున్నాయి.
ఆ జిల్లాలు వచ్చి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు..ఈ జిల్లాల్లో బిఆర్‌ఎస్ పార్టీకి బలం ఎక్కువే. ఈ జిల్లాలే మళ్ళీ బిఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని చూస్తున్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్ ల్లో మూడు పార్టీల మధ్య పోరు జరిగే ఛాన్స్ ఉంది.
ఇక మిగిలిన జిల్లాల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యం సంపాదించి..ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాల్లో కొంతమేర సీట్లు దక్కించుకుని..రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సగం సీట్లు గెలుచుకున్న చాలు మళ్ళీ బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమే. కాకపోతే నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బిఆర్‌ఎస్ పార్టీకి బిజేపితో పోటీ ఉంది. మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో బిఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ తో పోటీ ఉంది. మరి ఆ రెండు పార్టీలని ఎంతవరకు కట్టడి చేయగలిగితే అంతగా బిఆర్‌ఎస్ పార్టీకి మూడోసారి అధికారం దక్కే ఛాన్స్ ఉంది.